• Home
  • వార్తలు
  • స్కూల్ బస్సులో పిల్లలను తీసుకెళ్లడానికి బాధపడుతున్న ప్రైవేట్ స్కూళ్లు…బుద్ది చెప్పిన కోర్టు…
వార్తలు విద్య వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సామాజిక

స్కూల్ బస్సులో పిల్లలను తీసుకెళ్లడానికి బాధపడుతున్న ప్రైవేట్ స్కూళ్లు…బుద్ది చెప్పిన కోర్టు…

court slams private school for

పిల్లల చదువులు అంటే లక్షలు కళ్ళముందు కదులుతాయి. అంత ఫీజు చెల్లిస్తేనే చదువులు చెప్పే పాఠశాలలు తయారైన విషయం కొత్తేమి కాదు. కానీ అంత ఫీజులు తీసుకున్నాక అయిన శ్రద్దగా చదువు చెప్పడం మొదలుకొని పాఠశాలలో ఉన్నంత వరకు పిల్లలు క్షేమంగా చేసుకోలేని స్థితిలో ఆయా సంస్థలు ఉన్నాయంటే అతిశయోక్తి ఏమి కాదు. ఇక ప్రస్తుతం కేజీ విద్యను మొదలు కొని ప్రైమరీ చదువులు చదింవించాలంటే ఒకప్పుడు ఆ ఫీజుతో డాక్టర్ చదివేసేవారు.. అనేస్తున్నారు. అలాంటి స్థితిలో అంత ఫీజులు చెల్లించినా కూడా మళ్ళీ అలా ఉండాలి.. ఇలాంటివి చేయాలి.. అనే డిమాండ్లు కూడా తయారవుతాయి..

ఉదాహరణకు ఒక సందర్బంగా చెప్పుకుందాం…ఓ సాధారణ కుటుంబం. అందులో తండ్రి బిడ్డను ఒక పాఠశాలలో అక్షరాలా లక్ష రూపాయలు చెల్లించి ఒకటో తరగతిలో చేర్చాడు. ఇక ట్యూషన్ ఫీజు అవి, ఇవి అని మరో 70 వేలు చెల్లించాడు. అంతా ఫీజు కట్టేదాకా బాగానే ఉంది. కానీ కొన్ని రోజులు గడిచాక హఠాత్తుగా బస్సు వారు ఉండే అపార్ట్మెంట్ కు రాకుండా వారినే రోడ్డుపైకి పిల్లవాడిని తీసుకోని రావాల్సింది అని డిమాండ్ చేయడం మొదలైంది. కుదరని వారు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. వారు సరిగా స్పందించలేదు. దానితో విసిగిపోయిన తండ్రి వినియోగదారుల ఫోరమ్ లో పిర్యాదు చేశారు. విచారణ మొదలైంది. విచారణకు లాయర్ తో హాజరైన యాజమాన్యం తరుపున వాదించిన వారు కూడా స్కూల్ అంటే ఎవరికి సేవచేసే సంస్థ కాదు అని పెడసరిగా వాదించేసరికే…ఫోరమ్ లో వాదనలు వింటున్న అధికారికి పాఠశాల తీరు అర్ధం అయ్యింది. దీనితో సదరు పిల్లవాడి ఫీజును అపరాధ రుసుముగా వారి తండ్రికి చెల్లించాలని ఆదేశించింది. అయితే ఇదంతా వాదప్రతివాదనలు జరిగి న్యాయం జరగటానికి నాలుగేళ్లు పట్టడం విశేషం. ఇలా మొత్తానికి ప్రైవేట్ విద్యాసంస్థలు ఎలా ఉంటాయో మరో సారి స్పష్టం అయ్యింది.  

ఇదంతా బెంగుళూరు లోని రూట్స్ అకాడమీ అనే పాఠశాల నిర్వాకం. డబ్బులు కట్టించుకునేప్పుడు చూపించిన శ్రద్ద పిల్లవాడిని జాగర్తగా తీసుకెళ్లి, విద్యాబుద్ధులు చెప్పి, మళ్ళీ ఇంటి వద్ద జాగర్తగా దించేందులో ఆయా విద్యాసంస్థలకు లేకపోవటం విషాదకరం. అయినప్పటికీ తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూళ్ల వెంట పడి మరి వారి పిల్లలను చేర్చుకోవాలని బ్రతిమిలాడుకోవటం ఇంకా విశేషం. తల్లిదండ్రులు మారనంత కాలం ఇవన్నీ ఇలాగే ఉంటాయి అనేది అక్షర సత్యం. 

Related posts

నటిపై ప్రియుడి అత్యాచారం.. కేసు నమోదు

nagaraj chanti

మొగ్గలు

admin

హౌస్ లో అందరూ అమ్మాయిలైతే నాకు ఒకే అన్న నాగ్… రోల్ రైడా అవుట్

jithu j

Leave a Comment