telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శింబు, విశాల్ మధ్య వార్

simbu-and-vishal

తమిళ నటుడు శింబు, విశాల్ పై కేసు పెడుతూ కోర్టుకెక్కడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడూ వివాదాలకు దగ్గరగా నిలిచే శింబు 2017లో నటించిన “అన్భానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌” అనే సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాను మైకేల్ రాయప్పన్ నిర్మించగా, ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. శింబు షూటింగ్ కి సరిగ్గా రాకపోవడం, సరిగ్గా సహకరించకపోవడం, కథలో జోక్యం చేసుకోవడంతోనే తాను భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని నిర్మాత ఆరోపించారు. అంతేకాదు తనకు శింబు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ నిర్మాతల మండలిని ఆశ్రయించారు నిర్మాత మైఖేల్. దీంతో నిర్మాతల మండలి శింబుకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు శింబు స్పందించకపోవడంతో తడిపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం జరిగింది. అయినా శింబు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

అయితే తాను నటిస్తున్న తాజా చిత్రంపై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, నిర్మాత మైకేల్ రాయప్పన్ లపై శింబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. “అన్భానవన్‌ అడంగాదవన్‌ అసరాదవన్‌” సినిమాలో నటించడానికి రూ.8 కోట్ల పారితోషికం అయితే నిర్మాత రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చాడని, అంతేకాకుండా తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని… నిర్మాత తనకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కట్ట పంచాయితీ చేస్తున్నాడని కోర్టులో ఆరోపించారు శింబు. తన సినిమాలకు సంబంధించి నిర్మాతల మండలి కానీ, నటీనటుల సంఘం కానీ జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మంగళవారం శింబు తరఫున వాదనలు విన్న కోర్టు నిర్మాత మైకేల్ రాయప్పన్ కి, విశాల్ కి పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ నెల 18కి ఈ కేసును వాయిదా వేసింది కోర్టు.

Related posts