telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

పెళ్లి చేసుకుంటా.. అని నమ్మించి.. కార్యం కానిచేస్తే.., రేప్ అంతే .. : కోర్ట్

supreme court two children petition

నేటి కాలంలో సహజీవనం భారతదేశంలో కూడా చాలా సహజం అయిపోయింది. దీనితో యువతి పెళ్లి కాకుండానే తల్లిగా మిగిలిపోతుంది. దీనిపై తాజాగా స్పందించిన కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దానిప్రకారం పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి, యువతి అంగీకారంతోనే అయినా శారీరకంగా కలసి, ఆపై పెళ్లికి నిరాకరిస్తే, అది అత్యాచారమేనని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, చత్తీస్ గఢ్ లో ఓ యువతికి, అనురాగ్ సోనీ అనే యువకుడికి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించగా, సహజీవనం చేసింది. ఆపై అతను ముఖం చాటేయడంతో కోర్టును ఆశ్రయించింది.

ట్రయల్ కోర్టులో పదేళ్ల జైలు శిక్ష పడగా, నిందితుడు దాన్ని హైకోర్టులో సవాల్ చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీని తో జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ ఎమ్‌ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టి, శారీరక కలయికకు ఆమె సమ్మతిని సాధారణ అనుమతిగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. లైంగికంగా కలిసేందుకు ఆమె అంగీకరించినా అది అత్యాచారమేనని, హత్య కన్నా రేప్ అత్యంత దారుణమైనదని చివాట్లు పెట్టింది, నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

Related posts