telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శబరిమల, మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై వాదనలకు .. కోర్ట్ డెడ్ లైన్..

Sabarimala

శబరిమల ఆలయం, మసీదుల్లోకి మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్శీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం కల్పించడంపై దాఖలైన పిటినష్లపై వాదనలను వినేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు పదిరోజుల గడువు విధించింది. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని వెల్లడించింది. దీని గురించి సుప్రీం ధర్మాసనం ముందు సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా ప్రస్తావిస్తూ, సుప్రీం కోర్టు సూచన మేరకు వివిధ పార్టీలకు చెందిన న్యాయవాదులు సమావేశం నిర్వహించి దీని గురించి చర్చించారని, కానీ వారు ఏయే అంశాలపై వాదనలు విధించాలి అనే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారని తెలిపారు. దీనికి మరింత సమయాన్ని కేటాయించాలని కోరారు.

జనవరి 13 నుంచి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం శబరిమల వివాదంతో పాటు, మసీదుల్లోకి మహిళల ప్రవేశం, మతపరంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం న్యాయవాదులందరూ శబరిమల, ఇతర అంశాలపై ఎలా వాదించాలనే విషయమై చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. దీని కోసం మూడువారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. తాజాగా దానిపై విచారణ సందర్భంగా పదిరోజుల్లోగా వాదనలు ముగించాలని విస్తృత ధర్మాసనానికి సూచించింది.

Related posts