telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్ము కశ్మీర్ : .. హర్ముఖీ వ్యాలీని .. అధిరోహించిన జంట..

couple visited harmukkhi vyali in J & K

రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్య కశ్మీర్ అందాలను ఆస్వాధించే అవకాశం భారతీయులకే సరిగా లేని దుస్థితి నెలకోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు, రోజు ఎక్కడో ఓ చోట ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్ల మోతలు కశ్మీర్‌ను రక్త సిక్తం చేశాయి. తాజాగా 370 ఆర్టికల్ రద్దుతో అక్కడ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే..అయితే ఇవేవి పట్టించుకోని ఓ విదేశీ జంట కైలాశ్ ఆఫ్ కశ్మీర్‌గా పలిచే హర్ముఖీ వ్యాలీని అధిరోహించింది. ఇక్కడి పరిస్థితులకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అమర్‌నాథ్ యాత్రను సైతం 16 రోజుల ముందుగానే ముగించారు. దీంతో కశ్మీర్‌లో ఉన్న యాత్రికులను ఉన్నపళంగా కశ్మీర్ నుండి వెళ్లిపోవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్టు ఆయిదు నుండి కూడ ఇతర దేశాల టూరిస్టులు ఎవ్వరు కశ్మీర్ విజిటింగ్‌కు రాని పరిస్థితి నెలకోంది.

విదేశాలు కూడా కశ్మీర్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే తమ పౌరులను కశ్మీర్‌ వెళ్లవద్దని సూచించాయి. దీంతో కశ్మీర్‌కు గత నెలరోజులుగా టూరిస్టులు ఎవ్వరు కూడ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సూచనలను కూడా పక్కన పెట్టేసిన బెల్జియం జంట మాత్రం కశ్మీర్‌ కొండల్లో సహాస యాత్ర చేసింది. చాల రోజుల నుండి కశ్మీర్ టూర్ వేయాలని ప్లాన్ వేసుకున్న సామ్, నలియా అనే జంట వ్యాలీలోని హర్మూఖ్ పర్వత శ్రేణిని అధిరోహించాలని భావించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు పక్కన పెట్టి హర్ముక్ లేక్ వ్యాలీని సామ్, నలియా విజయవంతగా అధిరోహించారు.

హర్ముఖ్ హిల్స్‌లోని ఆల్ఫైన్ అడవులు, ఆందమైన ఆకుపచ్చ బయళ్లు ,అందమైన సరస్సులనను చూశామని వారు పేర్కోన్నారు. హర్ముఖ్ శిఖరం నుండి వెలువడే సూర్యోదయం తో పాటు సూర్యాస్తమయాన్ని చూడడం వారికి మరిచి పోలేని అనుభవమని తెలిపారు. స్థానికంగా ఓ సంచారజాతియుల సహాయంతో అక్కడకు చేరుకున్నట్టు వారు తెలిపారు. సంచారజాతీయులే వారికి అశ్రయిమిచ్చినట్టు చెప్పారు. తమ ప్రయాణంలో ఎలాంటీ ఉగ్రవాద చాయలు కూడ కనిపించలేదని వారు తెలిపారు. 15000 అడుగుల ఎత్తు ఉండే హర్మూఖ్ వ్యాలీ కైలాశ్ ఆఫ్ కశ్మీర్‌గా పేరుగాంచింది.

Related posts