telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి సబితాకు చేదు అనుభవం..మంత్రిని నిలదీసిన స్థానిక కార్పొరేటర్లు

Sabitha indrareddy

తెలంగాణను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో మహా నగరం హైదరాబాద్ అస్తవ్యస్తం అయింది. చాలా కాలనీలు మునిపోయాయి. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎంతంటే ఏకంగా ప్రజాప్రతినిధులపై దాడికి సిద్ధం అయ్యేంత. ఇప్పటికే ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చారు. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో అల్మాస్ గూడా, నాదర్గుల్, కురుమల్ గూడా నీటి ప్రవాహంతో ఉన్న కాలనీల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు.

బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిదో వార్డులో రెండు, మూడు రోజుల నుండి స్థానిక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బస్తీలో తిరుగుతూ స్థానిక ప్రజల అవసరాలు తీరుస్తూన్నారు. అయితే ప్రభుత్వం అధికారంలో ఉంటే కనీసం స్థానిక కౌన్సిలర్లకు సమాచారం లేకుండా వార్డుల్లో తిరగడం దారుణమని మంత్రి సబితాను స్థానిక కార్పొరేటర్లు నిలదీశారు. దీంతో చేసేదేమీలేక మంత్రి సబితా అక్కడి నుండి ఏమి సమాధానం చెప్పకుండా వెనుదిరిగింది. కాగామూడు రోజులుగా మహేశ్వరం నియోజకవర్గంలో కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే.

Related posts