telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు

karona

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అయినపట్టికీ రాజధాని హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఫేజ్‌-2కు చెందిన ఓ మహిళకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కరోనా సోకిన మహిళతోపాటు ఆ ఇంట్లో ఉన్న మరో ఇద్దరికి కూడా కరోనా ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సదరు మహిళ సోదరుడు ఇటీవలే యూకే నుంచి వచ్చినట్లు తెలిసింది.

Related posts