telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

‘లిక్కర్ దానం’ చేశాడు… పోలీసులు వచ్చి అత్తారింటికి తీసుకెళ్ళారు..

likker

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మందుబాబులకు కంటి మీద కునుకు ఉండటం లేదు.నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇక తెలంగాణలో అయితే మందుబాబులకు పిచ్చి పట్టి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో రెండో దశ లాక్ డౌన్‌ను కేంద్రం మే 3 వరకు పొడిగించడంతో హైదరాబాద్‌లో ఓ విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం పాతబస్తీకి చెందిన కుమార్ అనే యువకుడు మందుబాబులకు లిక్కర్ దానం చేయడం షురూ చేశాడు. స్థానిక బ్రాహ్మణవాడీ ప్రాంతంలో ఉన్నవారికి మద్యం ప్లాస్టిక్ గ్లాసుల్లో పోసి ఉచితంగా పంపిణీ చేశాడు. ఈ విధంగా సుమారు 10 బాటిళ్ల మద్యాన్ని దానం చేశాడు. ఇక ఈ తతంగాన్ని అతడి ఫ్రెండ్ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. కాగా, ఆ వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు కుమార్‌పై సెక్షన్ 34(a) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Related posts