telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఏపీ, తెలంగాణలో థియేటర్లు బంద్..!

Tollywood

కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో భాగంగా ప్రభుత్వాలు ముందస్తు చర్యలను తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలు షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, పబ్‌లు ఓ నెల రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వాటన్నింటికి సెలవులను ప్రకటిస్తూ అధికారిక ప్రకటనలు ఇచ్చేశాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమవతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇటు టాలీవుడ్ పెద్దలు కూడా కరోనా నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌ సభ్యులు శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్‌ ఆవరణలో భేటీ అవ్వబోతున్నారు. దాదాపుగా థియేటర్లు బంద్ చేయాలనే ఆలోచనలోనే సినీ ఇండస్ట్రీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Related posts