telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఢిల్లీలో పాజిటివ్, జైపూర్ లో నెగటివ్…అయోమయంలో ఎంపీ!

BJP MP Hanuman Jeniwwal

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దాదాపు 25 మందికి పైగా ఎంపీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరందరినీ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కు చెందిన ఓ ఎంపీ మాత్రం తన పరిస్థితితో అయోమయంలో పడ్డారు.

రాజస్థాన్ బీజేపీ లోక్ సభ సభ్యుడు హనుమాన్ బెనీవాల్ కు ఢిల్లీలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సభకు హాజరు కాకుండా, స్వరాష్ట్రానికి చేరుకొన్నారు. జైపూర్ లో మరోసారి పరీక్ష చేయించుకోగా నెగటివ్ వచ్చింది. తాను వ్యాధి బారిన పడలేదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన ఆ రిపోర్టు కాపీలను కూడా పోస్ట్ చేశారు. ఈ రెండింటిలో దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తాను అయోమయంలో పడిపోయానని వాపోయారు. ఇక ఆయన ట్వీట్ ను చూసిన నెటిజన్లు, ఇప్పటివరకూ సామాన్యులకు మాత్రమే ఇటువంటి తిప్పలు పరిమితం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఓ ఎంపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురైందని కామెంట్లు పెడుతున్నారు.

Related posts