telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

“కాణిపాకం” క్వారంటైన్ సెంటర్.. తప్పుడు పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్

ARREST crime

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంపై తప్పుడు పోస్టులను ప్రచారం చేసిన ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని  సిద్ధిపేటకు చెందిన  వ్యక్తి మ వాట్సాప్ ఖాతాల ద్వారా ఎంతో మందికి ఈ తప్పుడు వార్తను పంపినట్టు తేలింది.  

పోలీసుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం విష్ణువర్ధన్‌ రెడ్డి (56) తన ఫేస్‌ బుక్, ట్విటర్‌ ఖాతాల ద్వారా, కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్‌ సెంటర్‌ గా మార్చారంటూ ప్రచారం చేశాడు. దీనిపై కాణిపాకం ఆలయం ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విష్ణు వర్ధన్ రెడ్డిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.

Related posts