telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రష్యా వ్యాక్సిన్ పై నిపుణుల సందేహాలు!

corona vaccine

కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పనితీరుపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు, ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, జర్మనీ, బ్రిటన్ నిపుణులు రష్యా వ్యాక్సిన్ పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు నెలల్లో వ్యాక్సిన్ తీసుకురావడం ఎంతో ప్రమాదకరమని అంటున్నారు.

ఎంతో కీలకమైన ప్రయోగాలను హడావుడిగా జరుపడం రష్యా నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అని పేర్కొన్నారు. సర్వం సిద్ధమైనట్టుగా చెబుతున్న వ్యాక్సిన్ గురించి ఎక్కడ, ఎలాంటి ప్రయోగాలు నిర్వహించారో ఆ సమాచారం వెల్లడించకపోవడం అనుమానాలు కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.

లండన్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన యూనివర్సిటీ కళాశాల నిపుణులు వ్యాక్సిన్ పై స్పందిస్తూ అసంపూర్ణంగా ప్రయోగాలు జరిపిన వ్యాక్సిన్ ను పెద్ద సంఖ్యలో ప్రజలకు అందించడం సరికాదన్నారు. ఇలాంటి తొందరపాటు వ్యాక్సిన్ లతో దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన మూర్ఖత్వంతో కూడుకున్నదని విమర్శించారు. కాలక్రమంలో ఇలాంటి వ్యాక్సిన్ లపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వివరించారు.

Related posts