telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వైద్య సిబ్బంది పరిరక్షణకు కేంద్రం చర్యలు

karona

కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠినచర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. వైద్య సిబ్బంది పరిరక్షణకు కేంద్రం చర్యలు చేపట్టింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. అనేక ప్రాంతాల్లో వైద్యులపై దాడులు జరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది.

తబ్లిగీ జమాత్ కారణంగా రెండ్రోజుల్లో 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ 647 కేసులను 14 రాష్ట్రాల్లో గుర్తించామని పేర్కొంది. 960 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్య ప్రోటోకాల్ పూర్తయ్యాకే వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.

Related posts