telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీవీ షూటింగ్స్ పై కరోనా ఎఫెక్ట్… గురువారం నిర్మాతలు సమావేశం

Shooting

లాక్‌డౌన్ మినహాయింపుల తర్వాత సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ మొదలయ్యాయి. అయితే పలువురు నటులు, సిబ్బంది కరోనా బారిన పడటంతో సినిమా, టీవీ పరిశ్రమ వర్గాల్లో కలకలం రేగింది. దాదాపు 3 నెలల తర్వాత సినిమా, సీరియల్స్, రియాలిటీ షోస్‌కు సంబంధించి షూటింగ్ మొదలయ్యాయి. అయితే షూటింగ్స్ అంటే అన్ని డిపార్ట్‌మెంట్స్ వారు పాల్గొనాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో కరోనా నియంత్రణ చర్యలు సరిగా తీసుకోకపోతే ఖచ్చితంగా కరోనా ప్రభావం యూనిట్స్‌పై పడుతుంది. ఇప్పుడదే జరుగుతుంది. సరిగా నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో సీరియల్స్ షూటింగ్స్‌లోని కొందరు సిబ్బందికి, అలాగే నటుడికి కరోనా వ్యాపించినట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ షూటింగ్స్‌తో పాటు ఇతర షూటింగ్స్ కూడా కొన్ని రోజుల పాటు బంద్ చేయడమే బెటర్ అనే నిర్ణయానికి అంతా వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై నిర్మాతలు సమావేశం నిర్వహించి, తుది నిర్ణయం ప్రకటించనున్నారని సమాచారం. ఈ సమయంలో షూటింగ్స్ నిలిపివేయాలనే విజ్ఞప్తులు ఊపందుకున్నాయి. దీనిపై గురువారం నిర్మాతలు సమావేశం కానున్నారని తెలుస్తుంది.

Related posts