telugu navyamedia
రాజకీయ వార్తలు

 ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాం:కేంద్రమంత్రి హర్షవర్ధన్

Harshavardhan Central Minister

చైనాలో కరోనా వైరస్‌ను గుర్తించగానే తొలుత అప్రమత్తమైన దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19‌ను ఎదుర్కొంటున్న దేశాల్లో మనం ముందు వరుసలో ఉన్నామని తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మిగతా దేశాలకు మనం ఆదర్శంగా నిలిచామన్నారు.

వైరస్‌ను చైనా గుర్తించిన వెంటనే జనవరి 8న నిపుణుల బృందంతో సమావేశమయ్యామని, 17న ఆరోగ్య సూచనలు విడుదల చేశామని మంత్రి గుర్తు చేశారు.వైరస్ ప్రభావం ముంబై మహానగరంలో చాలా తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష పరీక్షలు చేయాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు.

Related posts