telugu navyamedia
andhra culture news

ఏపీలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 69 మంది మృతి!

Corona

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనా కాటుకు 69 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 10 మంది బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,041కి పెరిగింది.

తాజాగా 8,846 పాజిటివ్ కేసులు వచ్చాయి. 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925కి పెరిగింది. 4,86,531 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 92,353 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.

Related posts

స్వార్థం కోసం అభివృద్ధిని ఆపేశారు: చంద్రబాబు

vimala p

ఆదాయ పన్ను శ్లాబులో భారీ మార్పులు

vimala p

కండ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్!

vimala p