telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మెరికాలో విజృంభిస్తున్న కరోనా..ఒకే రోజులో 1480 మంది మృతి

corona america

కరోనా వైరస్ విజృంభించడంతో అగ్రరాజ్యం అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. పలు దేశాల్లో ఈ మహమ్మారి విజృంభించిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకొని జాగ్రత్త పడ్డారు. కానీ అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి.

24 గంటల వ్యవధిలోనే 1480 మంది మృత్యువాత పడ్డారు. గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది. ఇప్పటిదాకా 7402 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 1321 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts