telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో 24 గంటల్లో 78,512 కొత్త కరోనా కేసులు…!

corona vaccine India

గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేశాయా విషయం తెలిసిందే. ఇక భారతదేశంలో కరోనా తీవ్రత పెరిగిపోతోంది. ఇప్పటికే ఇండియాలో కరోనా కేసులు 36 లక్షలు దాటిపోయింది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 78,512 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 36,21,246కి చేరింది. ఇందులో 7,81,975 కేసులు యాక్టివ్ గా ఉండగా… 27,74,802 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 971 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 64,469కి చేరింది. కోలుకున్నవారి సంఖ్య పెరిగుతున్నప్పటికీ, యాక్టివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండటం గమనార్హం.

ఇక తెలంగాణలో కొత్తగా 1873 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. ఇందులో 92,837 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,299 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. జీహెచ్ఎంసి పరిధిలో 360, జగిత్యాల 77, కరీంనగర్ లో 180, ఖమ్మం 103, నల్గొండ 79, నిజామాబాద్ 94, రంగారెడ్డిలో 129, సిద్ధిపేట 85, సూర్యాపేటలో 65, వరంగల్ అర్బన్ లో 94 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 827కి చేరింది.

Related posts