telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో కరోనా రోగిపై అత్యాచారయత్నం!

Corona

హైద్రాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి సోకడంతో చికిత్స తీసుకుంటున్న యువతిపై ఆస్పత్రిలోనే కాంట్రాక్ట్ ఉద్యోగి అత్యాచారానికి యత్నించాడు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్తపడింది.

నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు మందలింపుతో సరిపెట్టుకున్నారు. నాంపల్లికి చెందిన యువతి వారం రోజుల క్రితం ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. యువతి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అండాల్సి ఉంది.

Related posts