telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా వైరస్ తో మరో ముప్పు.. పిల్లల రక్తనాళాలపై ప్రభావం!

Corona

అమెరికాలోని న్యూయార్క్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి న్యూయార్క్ లో రూపాంతరం చెంది, చిన్నారుల్లో భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ‘కవాసకీ డిసీజ్’ లక్షణాలు చిన్నారుల్లో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకూ 100 మందికి పైగా పిల్లలకు ఈ రోగ లక్షణాలు కనిపించాయని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో వెల్లడించారు. ఈ వ్యాధితో బాధపడుతూ ఐదేళ్ల, ఏడేళ్ల బాలురిద్దరు, 18 సంవత్సరాల అమ్మాయి మరణించారని ఆయన అన్నారు. ఇప్పుడు

కవాసకీ డిసీజ్ లక్షణాలను పరిశీలిస్తే, ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తనాళాలు ఎర్రగా మారి ఉబ్బిపోతాయి. జ్వరం వస్తుంది. ఈ లక్షణాలు మూడు దశల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఇది ఐదేళ్లలోపున్న పిల్లలకు సోకుతుంది. కానీ న్యూయార్క్ లో 18 ఏళ్ల అమ్మాయి కూడా ఇవే లక్షణాలతో మరణించడం ఇప్పుడు అక్కడి వారిలో ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా వల్ల మరో ముప్పును ఎదుర్కోవాల్సిన పరిస్థితులు న్యూయార్క్ లో తలెత్తాయి.

పైకి కనిపిస్తున్న లక్షణాలన్నీ కవాసకీ డిసీజ్ లేదా టాక్సిస్ షాక్ సిండ్రోమ్ లా కనిపిస్తున్నాయి. కొవిడ్ వైరస్ నుంచే ఇది సంభవించిందని భావిస్తున్నాము” అనిఆండ్రూ కూమో అన్నారు. రక్త నాళాలపై తొలుత ప్రభావం చూపే ఈ వైరస్, ఆపై గుండెపైనా ప్రభావం చూపుతోందని తెలిపారు. న్యూయార్క్ లో కనిపిస్తున్న ఈ మరో మహమ్మారి ఇతర రాష్ట్రాల్లోనూ ఉండే అవకాశాలున్నాయని తెలిపారు.

Related posts