telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా కేసులపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

prashnth kishore

కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ పొదగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్ చేశారు. కొవిడ్-19 కేసుల సంఖ్యను ఓ మారు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. లాక్ డౌన్ తొలి దశ నుంచి అన్ లాక్ 1.0 మధ్య కరోనా కేసులు 1002 రెట్లు పెరిగాయని, మరణాలు 1,348 రెట్లు పెరిగాయని అన్నారు.ప్రపంచంలోనే కేసుల సంఖ్యలో 7వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో భారత్ ఉందని అన్నారు.

టెస్టుల తరువాత పాజిటివ్ వస్తున్న కేసుల శాతం 1.3 నుంచి 5 శాతానికి పెరిగిందని, కేసులు నమోదైన జిల్లాల సంఖ్య 68 నుంచి 634కు చేరిందని తెలిపారు. జీ-20 దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల విషయంలో రెండో స్థానంలోనూ, మరణాల పెరుగుదలలో 4వ స్థానంలోనూ ఇండియా ఉందన్నారు. మార్చి 20 నాటికి 190 కేసులున్న భారతావనిలో జూన్ 1 నాటికి 1,90,535 కేసులు వచ్చాయని పేర్కొన్నారు.

Related posts