telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా ప్రపంచ మహమ్మారే: డబ్ల్యూహెచ్ఓ

karona effect

కరోనాను( కోవిడ్-19 ) ప్రపంచ వ్యాధిగా గుర్తించేందుకు నిరాకరించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూహెచ్ఓ), ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రపంచ మహమ్మారేనని ప్రకటించింది. చైనాలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, ఇటలీ, ఇరాన్ తదితర దేశాల్లో తొలి మరణాలు సంభవించిన తరువాత, కోవిడ్-19ను మహమ్మారిగా గుర్తిస్తున్నాం” అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అధానోమ్ మీడియాకు వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సైతం ప్రకటిస్తున్నట్టు ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. మొత్తం 114 దేశాల్లో 1.18 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ 4,291 మంది మరణించారని టీడ్రాస్ వ్యాఖ్యానించారు. ఈ వైరస్ మహమ్మారేనని చెప్పడానికి ఇంతకన్నా మరే నిదర్శనాలూ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

గత డిసెంబర్ లో చైనాలో తొలిసారిగా కనిపించిన ఈ వైరస్, ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి, ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఆర్థిక వృద్ధికీ విఘాతం కలిగించింది. వేలాది విమాన సర్వీసులు నిలిచిపోగా, ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు, తమ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. పాఠశాలలు మూతపడగా, పలు కీలక ఈవెంట్లు వాయిదా పడ్డాయి.

Related posts