telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు సామాజిక

కర్ణాటకలో విజృంభిస్తున్న కరోనా..హోం ఐసొలేషన్ లో కొత్త రూల్స్!

corona vairus

కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రులు పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హోం ఐసొలేషన్ నిబంధనలను కర్ణాటక ప్రభుత్వం మార్చింది. కొత్త నిబంధనలను విడుదల చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం తక్కువ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని మాత్రమే హోం కేర్ కు అనుమతిస్తారు. జిల్లా ఆరోగ్య సిబ్బంది లేదా అనుమతులు పొందిన ప్రైవేట్ సంస్థ సిబ్బంది తొలుత బాధితుడి ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. హోం ఐసొలేషన్ కు ఆ ఇల్లు అనుకూలంగా ఉందో లేదో అంచనా వేస్తారు. అనంతరం బాధితుడికి చికిత్స అందిస్తారు.హోం ఐసొలేషన్ లో ఉన్నంత కాలం ప్రతి రోజు టెలిఫోన్ ద్వారా బాధితుడి పరిస్థితిని అధికారులు తెలుసుకుంటారు.

ఐసొలేషన్ లో ఉన్నంత కాలం 24 గంటల పాటు ఫోన్ ద్వారా వైద్య సిబ్బందిని సంప్రదించే వెసులుబాటు వారికి ఉంటుంది. 60 ఏళ్లు దాటి, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించిన తర్వాతే హోం ఐసొలేషన్ కు అనుమతిస్తారు.

Related posts