telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

షాకింగ్ : అంత్యక్రియలకు హాజరైన 33మందికి కరోనా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.97 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త పెరిగింది.  అయితే.. తాజాగా కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వారిలో 33మందికి కరోనా పాజిటివ్ రావడం ప్రజల్లో కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలోని చేగుర్తి గ్రామంలో 60 ఏళ్ల వయసున్న దుర్గం కనకయ్య పదిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల్లో ఉన్న బంధువులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత వారిలో ఒకరు అనారోగ్యానికి గురికాగా కోవిడ్ పరీక్షల్లో అతని కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో అంత్యక్రియలకు హాజరైన వాళ్లలో గుబులు రేపింది. అయితే… అంత్యక్రియలకు హాజరైన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది.. గత గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ అని తేలింది. శుక్రవారం మరో 87 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కొవిడ్‌ సోకినట్లు వెల్లడైంది. గ్రామంలో మొత్తం 33 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్య అధికారులు చెబుతున్నారు. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి అవసరమైన మందులు అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు కరోనా రోగులకు నిత్యావసర సరకులను సమకూర్చుతున్నారు. కేవలం అంత్యక్రియలకు హాజరైన వ్యక్తులకే వైరస్‌ సోకిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

Related posts