telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా బాధితుల కోసం కాల్‌సెంటర్‌

Corona

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను ఎప్పటిప్పుడు చైతన్య వంతులను చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్‌కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఈ కాల్‌సెంటర్‌ ద్వారా కోవిడ్‌పాజిటివ్‌ వచ్చిన రోగులకు ఇంటి వద్దనే ఉంటూ హోం ఐసోలేషన్‌లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి కౌన్సిలింగ్‌ ఇస్తుంది.

సాధారణ పరిస్థితుల్లో రోజువారీగా 17 రోజుల పాటు కాల్‌సెంటర్‌ నుంచి నిపుణులతో ఫాలోఅప్‌చేస్తున్నారు. మైల్డ్‌ లక్షణాలు ఉన్నవారికీ టెలిమెడిసిన్‌ కన్సల్టేషన్‌ ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నారు. కాల్‌ సెంటర్‌ సిబ్బంది రెండు విడతల్లో సుమారు 200 మంది కాలర్స్‌తో నిరంతరాయంగా పనిచేస్తుంది.

Related posts