telugu navyamedia
సినిమా వార్తలు

అమ్మాయిలను టచ్ చేయడానికే బస్సు… బిగ్ బాస్ కంటెస్టెంట్ వ్యాఖ్యలు

ఇటీవల తెలుగులో నాగార్జున హోస్ట్‌గా మొదలైన బిగ్‌బాస్ సీజన్-3 ప్రారంభానికి ముందే వివాదాల్లో కూరుకుపోయింది. వివాదం ఢిల్లీ వరకు పాకింది. తాజాగా తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-3ని కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. భాష ఏదైనా ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో వివాదాస్పదం అవుతోంది. తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న నటుడు శరవణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాను అమ్మాయిలను ముట్టుకునేందుకే కాలేజీకి బస్సులో వెళ్లేవాడినని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలు విన్న హోస్ట్ కమల్‌ హాసన్‌తోపాటు ఇతర కంటెస్టెంట్లు, ప్రేక్షకులు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఈ ఎపిసోడ్ చూసిన ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిల్ని ముట్టుకోవడానికే తాను బస్సెక్కేవాడినని ఓ వ్యక్తి గర్వంగా చెబితే.. అది విన్న వారు నవ్వుతూ చప్పట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అతడి మాటలు వారికి జోక్‌గా అనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని ఓ తమిళ చానల్ ప్రసారం చేసిందని మండిపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను చిన్మయి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. చిన్మయి ట్వీట్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆమెకు అనుకూలంగా స్పందిస్తే మరికొందరు తప్పుబట్టారు.

Related posts