telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉద్యోగులకు ప్రజా సరఫరాల మంత్రిత్వ శాఖ లేఖలు

ramvilas paswan

గత కొన్ని రోజులుగా కరోనా సాకు చూపి విధులకు హాజరుకాని ఉద్యోగులకు ప్రజా సరఫరాల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. సేవలందించడంలో అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులు అవసరం లేదని స్పష్టం చేసింది. కన్స్యూమర్ అఫైర్స్ విభాగంలోని ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందేనని రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని వినియోగ వ్యవహారాల శాఖ వెల్లడించింది పేర్కొంది.

ఒకవేళ ఎవరికైనా విధులకు హాజరు కారాదన్న ఆలోచన ఉంటే, వారు 20వ తేదీలోగా తమతమ శాఖలకు సమాచారాన్ని ఇవ్వాలని, అప్పుడు వారిని రిలీవ్ చేస్తామని వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో పలు కార్యాలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. తిరిగి వీరందరినీ విధుల్లోకి ఆహ్వానిస్తూ, సోమవారం నుంచి తప్పనిసరిగా హాజరు కావాలని టెలిఫోన్ లో ఉన్నతాధికారులు సూచించారు. అయినప్పటికీ అత్యధిక శాతం ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. 

Related posts