telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

19 నుండి కాంగ్రెస్ .. ప్రత్యేక హోదా యాత్ర..ప్రియాంకగాంధీ..

congress yatra on special status from 19th

రాష్ట్ర విభజనలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. గత ఎన్నికలలో ఘోరంగా పరాభవం ఎదుర్కొంది. అటు రాష్ట్రం, ఇటు దేశంలో కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజకీయ అనిచ్చితి ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చింది. దీనితో మళ్ళీ అధికారం కోసం తాపత్రయ పడుతుంది. మరో పక్క దేశంలో అధికార పార్టీ బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకతనుఁ ఎదుర్కొంటుంది, ఇది కూడా కాంగ్రెస్ కు కలిసివచ్చింది. ఈవిధంగా మొత్తానికి దేశం లో అధికారం దక్కించుకోడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంది.

దానిలో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా కోసం యాత్ర చేయాలనీ నిర్ణయించింది. ఈరోజు కాంగ్రెస్‌ సీనయర్‌ నేత తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 19 నుండి ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. మడకశిర నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు భరోసా యాత్ర జరుగుతుందన్నారు. 25 లోక్‌సభ, 75 అసెంబ్లీ స్థానాలను కలుపుతూ 13 రోజులు యాత్రకు ప్రియాంకగాంధీ కూడా వస్తున్నారని తులసిరెడ్డి చెప్పారు.

Related posts