telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

హ్యాకైన కాంగ్రెస్ అధికార వెబ్‌సైట్..

Congress Website hacking gujarat

గుజరాత్ కాంగ్రెస్ అధికార వెబ్‌సైట్‌‌ హ్యాకింగ్‌కు గురైంది. గుర్తుతెలియని వ్యక్తి ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన హార్దిక్ పటేల్‌ను ఇరుకున పెట్టేందుకు ఆయనకు చెందిన ఓ ఫోటోను హ్యాకర్ పోస్ట్ చేశాడు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హార్దిక్‌కు చెందిన సెక్స్ వీడియోలంటూ బయటకు వచ్చిన వీడియాల నుంచి స్క్రీన్ షాట్ తీసిన ఫోటోను వెబ్‌సైట్‌లో అతను పోస్ట్ చేశాడు. దీనికి ‘కొత్త నేతకు స్వాగతం’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జోడించాడు.

కాగా, వెబ్‌సైట్ హ్యాకింగ్ గురైన సమాచారం గుర్తించిన వెంటనే పార్టీ ఐటీ టీమ్ అప్రమత్తమైంది. ‘మా వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. హార్దిక్ పటేల్ ఫోటోను అందులో హ్యాకర్ పోస్ట్ చేశాడు. హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లోకి రావడం ఇష్టం లేని వ్యక్తే ఈ పని చేసి ఉండొచ్చు’ అని పార్టీ రాష్ట్ర విభాగం కార్యదర్శి మనీష్ దోషి తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Related posts