telugu navyamedia
news political Telangana

టీఆర్ఎస్ ట్రిక్స్‌కు మోసపోయే వారెవరు లేరు: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

టీఆర్ఎస్ అగ్రనేతల ట్రిక్స్‌కు మోసపోయే వారెవరు లేరని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులకు టీఆర్ఎస్ పెద్దలు సీబీఐ విచారణను ఎదుర్కునే రోజు దగ్గరలోనే ఉందని విజయశాంతి జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేశామంటూ రెచ్చిపోయిన టీఆర్ఎస్ హైకమాండ్ మైండ్‌సెట్‌లో మార్పు వచ్చిందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారని తెలిపారు.

ఇప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారుతోందని పార్టీ అంతర్గత సమావేశాల్లో కార్యకర్తలకు కేటీఆర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయని ఆమె తెలిపారు. సీబీఐ విచారణ పేరుతో బీజేపీ నేతల హెచ్చరికలకు ఆందోళన చెంది కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చని విజయశాంతి అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్, టీఆరెఎస్‌ల మధ్య రహస్య అవగాహన ఉందనే అనుమానం ప్రజలకు కలిగే ప్రమాదం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

Related posts

ఎనిమిది స్థానాల్లో ఓటమిపై కేజ్రీవాల్ సమీక్ష

vimala p

నిత్యానంద మా దేశంలో లేడు … : ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం

vimala p

బీరు ఇకనుండి .. పేపర్లలోనే..

vimala p