telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో తప్పయితే.. తెలంగాణలో ఒప్పవుతాయ!: జగన్‌కు విజయశాంతి సవాల్‌

Congress vijayashanti comments Modi Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేరాలంటూ ప్రలోభ పెట్టడంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టిలో తప్పా.. ఒప్పా? సమాధానం చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి సవాల్‌ చేశారు. ఏపీలో పార్టీ ఫిరాయింపులపై తిరుగుబాటు చేస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభ పెడుతున్న కేసీఆర్‌తో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని జగన్‌ ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమన్నారు.

వైసీసీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరాలంటూ ఏపీ స్పీకర్ ప్రోత్సహించారంటూ రెండేళ్లుగా అక్కడి అసెంబ్లీని జగన్‌ బహిష్కరించారని తెలిపారు. ఫిరాయింపులు ఏపీలో తప్పయితే.. తెలంగాణలో ఎలా ఒప్పవుతాయని ఓ ప్రకటనలో విజయశాంతి ప్రశ్నించారు. స్పీకర్ పదవి చట్ట సభల్లో చాలా ఉన్నతమైందని అన్నారు. అందుకే స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోరులకు కూడా లేని విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ఈ మధ్యకాలంలో సభాపతులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనవుతున్నారని విమర్శలు రావడం శోచనీయమన్నారు.

Related posts