telugu navyamedia
రాజకీయ వార్తలు

కేసీఆర్‌ సర్కారుకు గవర్నర్ ఊహించని షాక్: విజయశాంతి

Vijaya Shanthi Comments KCR

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ బిల్లును వెనక్కి పంపి కేసీఆర్‌ సర్కారుకు గవర్నర్ ఊహించని షాక్ ఇచ్చారని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని జైలుకు పంపుతామని అప్పట్లో కేసీఆర్ హెచ్చరించారని విజయశాంతి గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు కూడా తప్పుబట్టిందని, కొన్ని జీవోలను కూడా రద్దు చేసిందని ఆమె గుర్తు చేశారు.

శిశుపాలుడు చేసిన తప్పుల్ని మించి కేసీఆర్ సర్కార్ తప్పులు చేస్తోందని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. నియంతృత్వ ధోరణితో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను విపక్షాలు తప్పుపడుతున్నా కూడ కేసీఆర్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ ను ఇంతకాలం వెనకేసుకొచ్చిన గవర్నర్ కూడ తన వైఖరిని మార్చుకొన్నారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తన తప్పుల్ని సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని విజయశాంతి హెచ్చరించారు.

Related posts