telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పేర్లు బయటకు రాకుండా కేసీఆర్ సర్కారు జాగ్రత్త పడింది: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో టీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా కేసీఆర్ సర్కారు జాగ్రత్త పడిందని విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో నాటకాన్ని మొదలు పెట్టిందని విమర్శలు గుప్పించారు.గ్యాంగ్ స్టర్ నయీమ్ డైరీలో ప్రస్తావించిన పేర్లు అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి కుదిపేస్తోంది. ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి నాటకాలు ఆడటం ఇది కొత్త కాదన్నారు.

నయీమ్ డైరీ లో పేర్కొన్న పేర్లకు సంబంధించి వివరాలు పత్రికల్లో వచ్చాయి. కానీ ఈ వివరాలలో కూడా చాలావరకు ఎడిటింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా నయీమ్ తో సంబంధాలు ఉన్న అధికారులు ఇతర పార్టీ నేతల వివరాలు వెల్లడించిన టిఆర్ఎస్ ప్రభుత్వం… తమ పార్టీకి సంబంధించిన కీలక నేతల వివరాలను ఎందుకు బయట పెట్టలేదు? అని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగా కొందరి పేర్లను మాత్రమే బయటకు లీక్ చేశారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విజయశాంతి డిమాండ్ చేశారు.

Related posts