telugu navyamedia
news political Telangana

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: వీహెచ్

hanmanth rao congress

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. నువ్వు అసలు మంత్రివేనా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఎక్కువ భజన చేయడం కూడా మంచిది కాదని హితవుపలికారు. రాజకీయాలు హుందాగా ఉండాలని అన్నారు.

తాము హెరిటేజ్ బిల్డింగ్ కూల్చోద్దని మాత్రమే అన్నామని, హాస్పిటల్ కట్టొద్దని తాము ఏనాడు అనలేదని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ పక్కనున్న ఖాళీ ప్లేస్‌లో కట్టాలని కోరామని చెప్పారు. కానీ తాము అడ్డుకున్నట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పక్కనున్న ఖాళీ ప్రదేశంలో కడతామని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు కట్టలేదని దుయ్యబట్టారు. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 

Related posts

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం.. నిన్న ఒక్కరోజే 920 కేసులు!

vimala p

ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్‌ ను ఇరికించమన్నారు.. చంద్రబాబు పై శశికుమార్ సంచలన వ్యాఖ్యలు!

vimala p

సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు: పురందేశ్వరి

vimala p