telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth-Reddy mp

సువిశాల నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యురేనియం తవ్వకాల విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు.

స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ అనుమతి లేకుండా ఫారెస్ట్‌లో తవ్వకాలు జరగకూడదన్నారు. నల్లమలలో తవ్వకాల కోసం 2016లో తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కలిసి కాంగ్రెస్‌పై నెపం నెడుతున్నారని దుయ్యబట్టారు. తుమ్మలపల్లిలో చెంచులు లేరు, ఫారెస్ట్ లేదని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి వెళ్లే నీళ్లు కలుషితం అవుతాయన్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ నల్లమలతో పాటు కడప జిల్లాలోనూ పర్యటించాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Related posts