telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

అందుకే హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టిండు: రేవంత్ రెడ్డి

Congress Revanth Comments TRS
తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మళ్లీ సీఎం కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావుకు మంత్రివర్గంలో చోటు  కల్పించరని అభిప్రాయపడ్డారు. హరీష్ కు మంత్రి పదవి రాకపోవడానికి కారణాలను కూడా రేవంత్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిడ్ మానేరు, గౌరెల్లి, తోట పల్లి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో  నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న  హరీష్ రావు వెయ్యికోట్లు దోచుకున్నాడని రేవంత్ ఆరోపించారు. 
అలా సంపాదించిన డబ్బులను కేసీఆర్ కు తెలియకుండా అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ పంచిపెట్టారని తెలపారు. ఇలా తన వర్గానికి చెందిన దాదాపు 30 మందికి హరీష్ డబ్బులు పంచారని రేవంత్ ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో కూడా హరీష్ ఫోన్ లో టచ్ లో వున్నారు. ఈ విషయాలన్ని కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో అప్పటినుండి హరీష్ ను దూరం పెట్టారని తెలిపారు. ఈ కారణాల వల్లే హరీష్ కు ఈ సారి మంత్రివర్గంలో చోటు దక్కదని రేవంత్ స్పష్టం చేశారు. 

Related posts