telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్ డౌన్ విధించినా ప్రయోజనం శూన్యం: రాహుల్

Rahul gandhi congress

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే లాక్ డౌన్ ప్రకటించి మోదీ సర్కారు సాధించిందేమీ లేదని వ్యాఖ్యానించారు. వైరస్ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న చర్యలు తుస్సుమన్నాయని అన్నారు.

అంతేకాదు, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే దేశాలతో పోలుస్తూ భారత్ లో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలును వివరిస్తూ రాహుల్ ఓ గ్రాఫ్ ను కూడా ట్వీట్ చేశారు. ఆయా దేశాల్లో కరోనా క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించి.. బాగా తగ్గుదల కనిపించినప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసిన తీరును గ్రాఫ్ ద్వారా విడమర్చారు. అదే ఇండియాలో మాత్రం కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తీరును గ్రాఫ్ ద్వారా చూపించారు.

ప్రస్తుతం భారత్ లో 2.37 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 1.14 లక్షల మంది కోలుకున్నారు. 6 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, భారత్ లో తొలి లక్ష కేసులకు నెలరోజులకు పైగా సమయం పట్టగా, రెండో లక్ష కేసులు కేవలం రెండు వారాల సమయంలోనే నమోదయ్యాయి.

Related posts