telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

24 గంటల పరీక్షా.. 1600 కోట్ల మార్కులా… బాబోయ్..

congress rafel campaign in social media

రాఫెల్ పై కోర్టు కల్పించుకొనని చెప్పినప్పటికీ, అదొక రాజకీయ అస్త్రంగా భావించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా రాఫెల్ ప్రశ్నా పత్రం అంటూ సామజిక మాధ్యమాల ద్వారా బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం ప్రారంభించింది. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ దాడిని తీవ్రతరం చేసింది. ఈ అంశాన్ని ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో అస్త్రంగా మలచుకున్న కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు సోషల్ మీడయాలో ఓ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేసింది. ‘రాఫెల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్… కరప్షన్ అనాలిసిస్’ పేరుతో ప్రశ్నలను సంధించింది. ఈ పరీక్షకు 24 గంటల సమయాన్ని నిర్ణయించింది. 1600 కోట్ల మార్కులకు పరీక్షను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. కింద ఉన్న నాలుగు ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వాలని కోరింది.

ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఇవే :
* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 126 యుద్ధ విమానాలు అవసరమైతే… కేవలం 36 మాత్రమే ఎందుకు కొంటున్నారు?
* ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 560 కోట్లతో కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు… ఒక్కో దానికి రూ. 1600 కోట్లు ఎందుకు వెచ్చిస్తున్నారు?
* హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను కాకుండా అనిల్ అంబానీని ఎందుకు ఎంచుకున్నారు?
* మోదీ గారు… రాఫెల్ ఫైల్ ను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (మాజీ రక్షణ మంత్రి) అతని బెడ్ రూమ్ లో ఎందుకు ఉంచుకున్నారు? ఆ ఫైల్ లో ఏముంది?

Related posts