telugu navyamedia
news political Telangana trending

ఆర్టీసీ కి మద్దతుగా.. రేపు ఛలో ట్యాంక్‌బండ్‌ .. కాంగ్రెస్ పిలుపు…

uttam congress mp

కాంగ్రెస్‌ పార్టీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కూమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా కేసీఆర్‌ మనసు కరగకపోవడం దారుణమని మండిపడ్డారు.

Related posts

10/10 సాధిస్తే రూ.25 వేల నజరానా: హరీష్ రావు 

ashok

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు చర్యలు!

vimala p

7500/- లకే … స్మార్ట్ టీవీ అందిస్తున్న జేవీసీ ..

vimala p