telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా…?

congress flags

గత ఎన్నికలో ఓటమిని బాధ్యత వహిస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా ఆ పదవికి ఎవర్ని నియమించాలి అనే విషయంపై ఇప్పటి వరకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  మళ్ళీ రాహుల్ గాంధీనే పగ్గాలు స్వీకరిస్తారనే వార్తలు వస్తున్నాయి.  కానీ, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండొచ్చు అన్నది తెలియాల్సి ఉన్నది.  2019లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఓటమిపాలవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.  అయితే, తాత్కాలిక పదవి కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.  సోనియాగాంధీకి వ్యతిరేకంగా కూడా కొంతమంది నేతలు గళం విప్పిన సంగతి తెలిసిందే.  పార్టీలో ప్రక్షాళన చేయాలని, శాశ్వత అధ్యక్షుడిని నియమిస్తేనే రాబోయే రోజుల్లో బీజేపీపై పోరాటం చేసేందుకు అనుకూలంగా ఉంటుందని సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు.  అయితే, కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక మే నెలలో ఉండే అవకాశం ఉన్నది.  మే 15 వ తేదీ నుంచి 30 వ తేదీ మధ్య కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుగుతుంది.  ఆ ప్లీనరి సమావేశంలోనే కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts