telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కోదండరాం కి ఇన్ని ఓట్లు ఎలా వస్తాయి…?

కాంగ్రెస్ నాయకత్వం పై ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములు నాయక్ ఫైర్ అయ్యారు. కొంత మంది రెడ్డి నాయకులు, డీసీసీ అధ్యక్షులు తనకు సహకరించలేదు అని కనీసం కరపత్రాలు కూడా పంచలేదు అని అన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, ఇదే సమయంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన రాములు నాయక్… తనకు కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే సహకరించారు అని తెలిపారు. ఈ ఎన్నికల్లో క్యాష్..అండ్ క్యాస్ట్ పని చేసింది. అయితే కోదండరాం పార్టీ కి ఏ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. Mlc ఎన్నికల్లో కోదండరాం కి ఇన్ని ఓట్లు ఎలా వస్తాయి. గాంధీ భవన్ లో సమావేశం పెట్టీ అన్నీ చర్చిస్తాం..,? నేను గెలిస్తే చాలా మందికి ఇబ్బంది ఐతదని ఓడగొట్టారు..? నియోజకవర్గానికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఐదు వేలైనా..? ఉంటుంది. కానీ నాకు అవి కూడా పడలేదు. గిరిజన ఓట్లు మాత్రం పడ్డాయి అని అన్నారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts