క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే…ఎన్.ఐ.ఏ కోర్టు ముందు…

HC orders actress Yash's Mother to pay rent 23.27 lakhs

మణిపూర్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(యాంథోన్గ్ హాకిప్) ఆయుధాలను తారుమారు చేసిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డీజీపీ). వాదనలు విన్న కోర్టు సదరు ఎమ్మెల్యే ను 15 రోజుల రిమాండ్ కు అప్పగించింది.

కోర్టు ఆదేశాలమేరకు ఎమ్మెల్యేను ఇంపాల్ ఈస్ట్ జిల్లాలోని పొరొమ్పట్ వద్ద ఉన్న జె.ఎన్.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంపాల్ లోని రెండవ బెటాలియన్ మణిపూర్ రైఫిల్ ప్రాంగణంలో ఉన్న డీజీపీ పూల్ నుండి 58 మ్యాగజైన్స్, 56 తుపాకీలు అనధికారికంగా తరలించిన కేసును ఎన్.ఐ.ఏ దర్యాప్తు చేస్తుంది.

సెప్టెంబర్ 11, 2014లో రాష్ట్ర ప్రభుత్వ భద్రతా దళాలకోసం కొనుగోలు చేసి, రవాణా చేస్తున్నప్పుడు ఇవి పోయినట్టు తెలుస్తుంది. దర్యాప్తులో విషయాలు తెలుసుకున్న ఎన్.ఐ.ఏ సదరు ఎమ్మెల్యే ఇంటిలో సోదాలు నిర్వహించగా పోయిన ఆయుధాలు దొరకడంతో వారిని విచారిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురు ఖైదు చేయబడ్డారు.

Related posts

తాను చనిపోతూ… నలుగురికి ప్రాణ దానం

jithu j

వైష్ణవి దేవి ఆలయానికి మరో మార్గం…

admin

ఇది ఇలాగే కొనసాగితే మ్యాప్ లోనుంచి అంతం కానున్న అగ్రదేశం….

chandra sekkhar

Leave a Comment