telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హరీష్ రావు ను .. అందుకే పక్కన పెడుతున్నారు.. : జగ్గారెడ్డి

Jaggareddy gives clarity party change

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబంపై రాజకీయ విమర్శలు చేశానే తప్ప… వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. కేసీఆర్ వల్ల తనకు రెండు సార్లు మంచి జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని… తనను జైల్లో పెట్టినప్పుడు తన కుమార్తెను తెరపైకి తెచ్చానని చెప్పారు.

హరీష్ రావుతోనే తనకు విభేదాలున్నాయని జగ్గారెడ్డి అన్నారు. తనను జైల్లో పెట్టించింది హరీషేనని మండిపడ్డారు. హరీష్ రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారని విమర్శించారు. కేటీఆర్ నిజాయతీ గల నాయకుడని ప్రశంసించారు. లాబీయింగ్ చేసే వారికే కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయని… తనలాంటివాళ్లకు లాబీయింగ్ చేసేవాళ్లు లేరని జగ్గారని అన్నారు. ఇబ్బంది పడుతున్న నేతలకు రాహుల్ గాంధీ భరోసా ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 75 శాతం మంది నేతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు.

Related posts