telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సగానికిపైగా రాష్ట్రాలలో .. కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు… 17 యూనిట్లలో కాంగ్రెస్‌కు పెద్ద సున్నా..

AP Congress candidates list release shortly

కాంగ్రెస్‌కు తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఆవేదనను మిగిల్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల వ్యూహాలు కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీలను కూడా నివ్వెరపరిచాయి. నవ భారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ, ‘గరీబీ హఠావో’ నినాదంతో ప్రజల గుండెల్లో నిలిచిన ఇందిరా గాంధీ వంటి నేతలు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం ఒక్క లోక్‌సభ స్థానాన్ని అయినా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేకు దేశవ్యాప్తంగా 52 స్థానాలు మాత్రమే లభించాయి. దాదాపు దేశంలోని సగ భాగానికి లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం కాంగ్రెస్‌కు దక్కలేదు.

ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీరు, మణిపూర్, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, అండమాన్-నికోబార్, చండీగఢ్, దాదర్ నగర్ హవేలీ, డామన్ డియు, లక్షద్వీప్‌లలో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ పరిస్థితిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా నష్టపోయింది. 17 యూనిట్లలో కాంగ్రెస్‌కు పెద్ద సున్నా వచ్చింది’’ అన్నారు

Related posts