telugu navyamedia
andhra news political Telangana trending

కాంగ్రెస్ నాయకుల స్పష్టత.. తాము తెరాస లో…

congress leaders cleared on joining in trs party

తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఘనవిజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం కూడా ఆకర్ష్ పథకం కింద ఇతర పార్టీ నేతలను తెరాస లో కి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అరకొరగా సీట్లను దక్కించుకున్న టీడీపీ, కాంగ్రెస్ నాయకులను తమవైపు తిప్పుకునే తెరాస ప్రయత్నాలు విఫలం అయ్యాయనే చెప్పాలి. కారణం, తాజాగా, తాము టీఆర్ఎస్ లో చేరట్లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.

ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ లో తాము చేరుతున్నట్లు మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలోనే ఆయన్ని తాము గౌరవపూర్వకంగా కలుస్తున్నాం తప్ప, వేరే ఆలోచనలు ఏవీ లేవని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాము చేసిన రీ డిజైనింగ్ ఆరోపణలకు తాము కట్టుబడిఉన్నామని వారు స్పష్టం చేశారు.

Related posts

సహవాసం…

vimala p

విజయదేవరకొండ బైక్ రేసర్ గా … కొత్త అవతార్..

vimala p

పొత్తు కుదరటంలేదు .. జనసేనతో .. సీపీఐ .. నేడే కీలక నిర్ణయం…

vimala p