telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ కొత్త ఫార్ములా .. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసింది.. : రేవంత్

revanth reddy fire on kcr decision on new buildings

మరోసారి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. దోపిడీకి కేసీఆర్‌ ఒక ఫార్ములా కనిపెట్టారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. చత్తీస్‌గఢ్‌ నుంచి అధిక ధరలకు విద్యుత్‌ ఒప్పందం చేసుకున్నారని, అక్కడి ఒప్పందాన్ని చూపించి ప్రజల్ని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ప్రధాని మోదీతో ఉన్న సత్సంబంధాల వల్ల అనుమతులు తెచ్చారని, 24 నెలల్లో ప్లాంట్‌ను పూర్తి చేస్తామని బీహెచ్‌ఈఎల్‌ చెప్పిందన్నారు.

కేసీఆర్‌ తన మనుషులకు మాత్రమే పనులు ఇప్పించారని ఆయన ఆరోపించారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ ఆలస్యం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ ఆలస్యంతో రూ.10 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని, ఇప్పటి వరకు ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు. దివాళా తీసిన అదాని కంపెనీ బొగ్గును అమ్ముకోవడానికి కేసీఆర్‌కు లంచాలు ఇచ్చి చత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేయించారని, మార్వా విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పని జరగడం కోసం కుట్ర చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Related posts