తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణలో కూడా రైతు సంక్షేమ పథకాలు

Congress Leader Chinna Reddy Comments TRS

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటక మాదిరిగా తెలంగాణలో కూడా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతు బంధు పథకం కంటే, మద్దతు ధర రైతులకు చాలా మేలు చేస్తుందని పేర్కొన్నారు. భూ ప్రక్షాళన తప్పుల వల్ల చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భూ ప్రక్షాళనలో 9లక్షల తప్పులు దొర్లినట్లు సీఎం చెప్పారని అన్నారు.

భూ ప్రక్షాళన పరిస్థితి.. కొండనాలుకకు మందేస్తే! ఉన్న నాలుక ఊడిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తుందని పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతు ధరతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం పేరు మార్చమంటే.. ఈ సర్కారుకు మనసు రావటంలేదన్నారు. సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.

Related posts

హీరోయిన్ గా గీతామాధురి..

jithu j

మహిళల బిల్లుపై చర్చ జరుగుతుందా ?

admin

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు లో మోడీ

admin

Leave a Comment