telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజల ఆరోగ్యాలకు భరోసాలేని పరిస్థితి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణలో ప్రజల ఆరోగ్యాలకు భరోసాలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇద్దరు వ్యక్తులు కరోనా మరణవాంగ్మూలాన్ని ఇచ్చి మృతి చెందారని అన్నారు. దేశంలో ఇలాంటి దుస్థితి ఎక్కడా లేదని అన్నారు. మానవహక్కుల కమిషన్ ఈ ఘటనలను సుమోటోగా తీసుకుని, విచారణ చేపట్టాలని కోరారు.

వైద్య సాయం అందక ఇద్దరు వ్యక్తులు మరణవాంగ్మూలంతో చనిపోతే. రాష్ట్ర ఆరోగ్యమంత్రి సెల్ఫీ వీడియోను తప్పుబడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఎంత క్షోభ పడ్డారోనని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. చెస్ట్ ఆసుపత్రిలో పని చేస్తున్న హెడ్ నర్సు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Related posts