telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారు:  శ్రవణ్‌

Dasoju Sravan
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో  తెలంగాణ ప్రయోజనాలను కాపాడంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఘోరంగా విఫలమైయ్యారని  ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌  విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందనిఅన్నారు. తెలంగాణ ప్రజలకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కూడా సాధించలేకపోయారని మండిపడ్డారు. 
మిషన్‌ భగీరథ పథకానికి నిధులు, రైల్వే కోచ్‌, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీని డిమాండ్‌ చేయడంలో టీఆర్‌ఎస్‌ దారుణంగా విఫలమైందని శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీకి టీఆర్‌ఎస్‌ పార్టీ కొమ్ము కాస్తోందని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల నోళ్లలో మన్ను కొట్టాయని ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేదని శ్రవణ్‌ అన్నారు.

Related posts