telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి

Batti vikramarka

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. 180 బెడ్స్‌ ఉన్న ఆస్పత్రిలో కనీస అయిద్య సిబ్బంది లేరని అన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు శూన్యమని భట్టి వ్యాఖ్యానించారు.

బతికేవాడు బతుకుతాడు..చచ్చేవాడు చస్తాడన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబాట్టారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో కూడా కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు. కరీంనగర్‌లో 6000 మంది కోవిడ్ పేషంట్స్ ఇళ్ళల్లోనే ఉన్నారని తెలిపారు. వాళ్లకు కనీస సదుపాయాలు లేవని చెప్పారు. తొమ్మిది నెలల నుంచి ఆసుపత్రుల్లో సిటీ స్కాన్‌లు పని చేయడం లేదని అన్నారు.

Related posts